పచ్చి కూరగాయలు తింటే పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూరగాయల్లో క్యారెట్, బీట్ రూట్, ఉల్లిపాయలు, క్యాప్సికం, కీరాలను కట్ చేసి సలాడ్స్‌గా చేసుకొని మిరియాల పొడి వేసుకొని తీసుకోవచ్చు. వీటి ద్వారా విటమిన్ సి, బి కాంప్లెక్స్, బి 6, పోలిక్ యాసిడ్స్ లభ్యమవుతాయి. దగ్గు, జలుబు కూడా రావు. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. కూరగాయల్లో పీచు ఉండటంతో మలబద్ధకం సమస్య రాదు.