అల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేరుకుంటుంది. అయితే అల్లంని సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు.అల్లాన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అల్లం పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాక కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ఆలాగే అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గొంతు నొప్పిని దూరం చేస్తుంది.