మనకు జ్వరం లేదా తలనొప్పి వస్తే వెంటనే గుర్తుకొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ అధిక మోతాదులో తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ అతిగా వాడటం వల్ల కాలేయం ఎక్కువగా ప్రభావితమవుతుంది. మూత్రపిండాలు, ప్రేగులు మరియు గుండెను దెబ్బతీస్తుంది. కాలేయంలో గ్లూటాతియోన్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు కణాలను నాశనం చేస్తుంది. పారాసెటమాల్ సరైన మోతాదు తీసుకోవడం మాత్రమే ఉత్తమ మార్గం అని డాక్టర్స్ అంటున్నారు.