బ్రొకోలీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో బ్రొకోలీని ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రొకోలీలో ఐరన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోడియం, విటమిన్ సి వంటి మూలకాలు కనిపిస్తాయి. బ్రొకోలీలో ఉండే ఫైబర్ బరువు తగ్గడంతో సహాయపడుతుంది. బ్రొకోలీ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బ్రొకోలీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్రొకోలీని తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. బ్రొకోలీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.