బీర్ తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బీర్ అధికంగా తాగడం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది. బీర్ అధికంగా తాగడం వల్ల అందులో ఉండే గ్యాస్ కడుపులో ఎసిడిటీని కలిగించడంతో పాటు కడుపులో మంట, జీర్ణాశయ సమస్యలు, పేగుల్లో అలజడి మొదలైన అనారోగ్యాలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. చల్లని బీరు తాగడం వల్ల వేడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.