ఇవాళ ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా కేవలం 2 బంతుల్లో 21 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ హెన్రీ వేసిన 3వ ఓవర్లో తొలి బంతిని వార్నర్ సిక్స్ కొట్టాడు. రెండో బంతి నో బాల్ కాగా సింగిల్ వచ్చింది. తర్వాతి ఫ్రీ హిట్ బంతికి హెడ్ సిక్స్ కొట్టాడు. కానీ అది కూడా నోబాల్ అవడంతో మళ్లీ వేసిన బంతిని హెడ్ మళ్లీ సిక్స్ బాదాడు. దీంతో రెండు లీగల్ డెలివరీల్లో ఆసీస్ మొత్తం 21 పరుగులు రాబట్టింది.