మనం కూరల్లో వండుకొని తినే టొమాటో ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అదే విధంగా మేలు చేస్తుంది. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో టమోటాలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో టమోటాలను నల్ల మిరియాల పొడితో తింటే శరీరంలోని నులిపురుగులు చనిపోతాయి. గుండె జబ్బులతో బాధపడేవారు టమోటా లేదా దాని రసం కనుక తీసుకుంటే, అది గుండెపోటు ఇంకా అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటిచూపు తక్కువున్న వారికి కూడా టమోటా చాలా మంచి ఆహారం. ఈ కూరగాయలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి సమస్యలు దూరమవుతాయి.