దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 63,698 దగ్గర, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 19,022 దగ్గర కొనసాగుతోంది. రిలయన్స్, టెక్ మహీంద్రా, మారుతీ, సన్‌ఫార్మా, HCL, విప్రో, TCS షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ITC షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.