తులసి గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ గింజల్లోని యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు జలుబు, దగ్గు చికిత్సకు సహాయపడతాయి. తులసి గింజలు, తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి గింజల్లో ఉండే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లను రసాలు లేదా సలాడ్లతో కలిపి తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చు.తులసి గింజలు రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకారిగా ఉంటాయి. తులసి గింజలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి.