సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ సోమవారం తమ ఉద్యోగులకు స్టాక్ గ్రాంట్స్‌ను జారీ చేసింది. తాజాగా జారీ చేసిన స్టాక్ గ్రాంట్స్ ప్రకారం కంపెనీ విలువ కేవలం 19 బిలియన్ డాలర్లు అని పేర్కొంది. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ దీనిని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఎక్స్ విలువ దాదాపు సగానికంటే తక్కువగా ఉంది. స్టాక్ గ్రాంట్స్ విలువను కంపెనీ బోర్డు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తుంది.