ఎండుద్రాక్ష మనకు చాలా చోట్ల విరివిగా లభిస్తుంటుంది. దీనిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పడుకునే ముందు లేదా నిద్రలేవగానే నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విషపదార్ధాలను తొలగిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, ఎ-కెరోటినాయిడ్, బీటా కెరోటిన్ వంటి పాలీఫెనోలిక్ ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కంటి చూపును గణనీయంగా మెరుగు పరుస్తాయి.
ఎండుద్రాక్షలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇందులో తగు మోతాదులో పొటాషియం ఉంటుంది. ఇది మీ శరీరంలోని సోడియం కంటెంట్‌ను సమతుల్యం చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎండుద్రాక్ష ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఎండుద్రాక్ష తీసుకోవడం మంచి ఫలితాన్ని పొందుతారు. ఎండు ద్రాక్షలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.