సొరకాయతో ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్లు కూడా ఉంటాయి. సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు. సొరకాయ తింటే.. మంచి నిద్రపడుతుంది. జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.