భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నాటికి సెన్సెక్స్ 163.78 పాయింట్లు క్షీణించి 64,794.91 వద్ద, నిఫ్టీ 43.25 పాయింట్లు క్షీణించి 19,368.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ఉండగా, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, HDFC బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.