ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది. చలి వల్ల చాలా మంది స్నానం చేయడానికి ఇష్టపడరు. కానీ చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మంపై బ్యాక్టీరియా ఉధృతి పెరిగి దురదలు, పగుళ్లు వస్తుంటాయి. అందుకే రోజూ స్నానం చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే సబ్బును వాడాలన్నారు. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజేషన్ లేదా ఆయిల్‌ను చేతులు, కాళ్లకు రాసుకోవాలి. శుభ్రమైన దుస్తులను ధరించాలి.