బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులకు వాయువ్య దిశగా సుమారు 200 నాటికల్ మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్.ఎస్.సి. గుర్తించింది. కాగా, తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు..సునామీ ముప్పు లేదని వెల్లడించారు.