పాలకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాలకూరలో విటమిన్ ఏ, సీ, కే, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి రక్తంలో ఇన్ఫెక్షన్‌తో పోరాడే తెల్ల రక్త కణాలను పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.