దేశీయ స్టాక్ మార్కెట్‌లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 560 పాయింట్ల లాభంతో 65,494 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 177 పాయింట్లు లాభపడి 19,620 దగ్గర కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, టైటన్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, NTPC, TCS, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, HCL టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.