శీతాకాలం వచ్చిందంటే చాలు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి చాలా మంది రోగాల బారిన పడుతుంటారు. వాతావరణంలో మార్పు, పొగమంచు, చల్ల గాలి కారణంగా.. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ జబ్బుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాల టీ బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. లవంగాల టీలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సీజనల్ వ్యాధులను దరిచేరనీయవు.