దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 66,174 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,858 దగ్గర కొనసాగుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 వద్ద ప్రారంభమైంది. అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మిగితా కంపెనీలు లాభాల్లో ఉన్నాయి.