దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 19,816 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.33 వద్ద ప్రారంభమైంది. ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.