శివుడికి ఇష్టమైనటువంటి కార్తీకమాసంలో నవంబర్ 27వ తేదీన (సోమవారం) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివారాధన చేయడం వల్ల, జ్వాలాతోరణం వంటివి దర్శించుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో లేదా ఇళ్లలో ఉన్న తులసి చెట్టు వద్ద ఆవు నేతితో కానీ, నువ్వు నూనెతో కానీ దీపాలు వెలిగించడం ఎంతో మంచిది.
కేదారేశ్వర వ్రతం వంటి వ్రతాలను కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాలి. అలాగే ఈ రోజున పుణ్య నది స్నానాలు చేయాలి. ఈ రోజు శివాలయాలలో నది పరివాహక ప్రాంతాలలో ఇళ్లలో శివరాధన, శివునికి అభిషేకం వంటివి ఆచరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఆచరిస్తే అటువంటి వారికి శివానుగ్రహం వల్ల పుణ్యము దక్కుతుందని పండితులు తెలిపారు.