అనవసరమైన కాల్స్, మెసేజ్లకు స్వస్తి పలకడానికి 'TRAI' ఓ కొత్త యాప్ తీసుకువచ్చింది. 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడానికి 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. అయితే ఇందులో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ట్రాయ్ ఇప్పటికే ఏజెన్సీని నియమించింది. కాగా 2024 నాటికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేసింది.