దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 33.53 పాయింట్లు పెరిగి 66,003.57 వద్ద, నిఫ్టీ 22.90 పాయింట్లు పెరిగి 19,817.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, విప్రో షేర్లు లాభాల్లో, M&M, ICICI బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, TCS షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.36 వద్ద ఉంది.