దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 92.52 పాయింట్లు పెరిగి 66,994.43 వద్ద, నిఫ్టీ 32.30 పాయింట్లు పెరిగి 20,128.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, BPCL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో, ఏషియన్ పెయింట్స్, NTPC, TCS, విప్రో షేర్లు నష్టపోయాయి. లరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.30 వద్ద ఉంది.