దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 306 పాయింట్లు పెరిగి లాభంతో 67,295 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 20,228 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలోఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద ఉంది.