మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. అయితే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లలో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే బ్రోకలి, కాలే వంటి ఆకుకూరల్లో అనేక విటమిన్లు ఉంటాయి. వీటిలో ఉండే ఫోలేట్, విటమిన్ కేలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.