దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.22 గంటల నాటికి సెన్సెక్స్ 825 పాయింట్ల లాభంతో 68,306 వద్ద, నిఫ్టీ 248 పాయింట్లు లాభంతో 20,516 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ సూచీలో SBI, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 వద్ద ఉంది.