చలి కాలంలో చల్లని గాలులతో చర్మం పొడిబారుతుంది. ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం పొడిబారకుండా స్నానం చేసిన 3 నిమిషాల్లోగా తప్పనిసరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అలాగే సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి. అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత, సన్ స్క్రీన్ ను వాడాలి. చలికాలంలో రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగితే మంచిది.