ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఎంతో అవసరం. అవి మన శరీర జీవక్రియలను సాఫీగా సాగేందుకు ఉపయోగపడతాయి. మరి ఆ విటమిన్స్, మినరల్స్ ఏంటోో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎముకల బలానికి ముఖ్యంగా కావాల్సింది క్యాల్షియం. ఇది మన శరీరానికి అందాలంటే విటమిన్ డి తప్పకుండా ఉండాలి. విటమిన్ డి, క్యాల్షియం లోపం ఉన్నవారికి తరచుగా ఎముకల నొప్పులు, వెన్నెముక నొప్పి, జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతాయి.
మెగ్నీషియం మన శరీరానికి ఎంతో అవసరమైనది. నాడీ వ్యవస్థ సాఫీగా సాగేందుకు, నిద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు ఇది ఎంతో అవసరం. ఐరన్ అనేది మల్టీ విటమిన్. పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా ఐరన్ లోపం అనేది ఉంటుంది. ఐరన్ లోపం ఉండేవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో అవసరం. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండాలంటే జింక్ ఎంతో సాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.