ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లో బీటా-కెరోటిన్, విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయంటున్నారు. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుందన్నారు. దీనిలోని పొటాషియం, విటమిన్ సి వంటి ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు.