దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేండింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 61.02 పాయింట్ల లాభంతో 69989.55 వద్ద, నిఫ్టీ 24.04 పాయింట్ల లాభంతో 21021.15 వద్ద కొనసాగుతున్నాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, జిందాల్ స్టీల్, డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. BPCL, ONGC, ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో, అపోలో హాస్పిటల్ నష్టాల్లో ఉన్నాయి.