థైరాయిడ్ సమస్యకు అలోవెరా జ్యూస్ అద్భుతమైన ఔషధం. ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులతో కలిపి అలోవెరా జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స్థూలకాయం తగ్గుతుంది. ఫలితంగా థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. దాన్ని పరగడుపున తాగితే మరింత ప్రయోజనం కలుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ముఖం, చేతులు, కాళ్లలో ఉబ్బినట్టు ఉంటుంది. అలోవెరా జ్యూస్ వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.