భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 43.88 పాయింట్లు పెరిగి 71,358.97 వద్ద, నిఫ్టీ 17.00 పాయింట్లు పెరిగి 21,435.70 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ONGC, నెస్లే, అపోలో హాస్పిటల్, బ్రిటానియా, కోల్ ఇండియా లాభాల్లో ఉండగా, TCS, HDFC బ్యాంక్, టైటాన్, HCL టెక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం 83.10 వద్ద ప్రారంభమైంది.