ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వాడకం మరింతగా పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ ఫోన్‌పే, గూగుల్ పే, పేటియం ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే వీటి లాక్‌లు తీసి, పాస్‌వర్డ్‌లు కొట్టడానికి సమయం వృథా అవుతుందని అనుకున్నారేమో..
సెల్‌ఫోన్‌కి రింగ్ ఇచ్చినంత సమయంలోనే వేలికి తొడిగిన రింగ్ (ఉంగరం)తో డబ్బులు చెల్లించే సరికొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చారు. భారత్‌లోనే మొదటి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వేరబుల్ రింగ్ ఇది. దీని పేరు ‘7 రింగ్’.