ప్రముఖ టెలికాం ఆపరేటర్ ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డాటా లీక్ అయింది. ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ సేవలు పొందుతున్న వేలాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది.
పెరెల్ అనే హ్యాకర్ వినియోగదారుల వ్యక్తిగత, గుర్తింపు వివరాలను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఇందులో యూజర్ల వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్ ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్, బిల్లింగ్ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.