1) మేషరాశి.... (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
ప్రారంభములో రావలసిన ఆదాయాన్ని అందుకుంటారు. గృహములో వాతావరణం కొంత చికాకు. ముఖ్యమైన పనులు, ఆరోగ్య విషయంలో అలోచించి నిర్ణయాలు అవసరం. సంతానం విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వారి ఫలితాలు కొంత తక్కువగా ఉండటం వల్ల త్వరగా మీరు ఆందోళన,మానసిక అశాంతికి లోనవుతారు. అయినప్పటికి మరల మిమల్ని మీరు నెమ్మదించుకొని వారి విషయములో భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. సంతానం కొరకే ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యా సంబంధ కంప్యూటర్ల మొదలైన వాటి కోసం ధనాన్నివెచ్చిస్తారు జీర్ణసం బంధ చికాకులు. తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెడతారు. విద్యాపరంగా విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు చేస్తారు. వారి శ్రమకి గుర్తింపు కొంత లభిస్తుంది. స్వగ్రామము వెళ్ళటానికి ఆలోచనలు.ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధికారంలో ఉండే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉపాసన పెంచుకుంటారు. వృత్తిపరంగా పడిన కష్టానికి తగినంత గుర్తింపు రావటం లేదని బాధపడతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. తెలియని ఆందోళన అసంతృప్తి ముఖ్యమైన పనులు ముందుకు వెళ్ళకుండా నిరోధించే అవకాశాలు. ఉద్యోగం అభివృద్ధి కొరకు, ఆటంకములు తొలగడానికి “శ్రీ రాజమాతన్గ్యేయన మహః” అనే శ్లోకాన్ని పఠించాలి
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
ప్రారంభంలో సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. తోబుట్టువులు లేదా మిత్రులకు సంబంధించిన వారికి ప్రణాళికల్లో సలహాలిస్తూ సహకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. చాలా కాలం ఎదురు చూస్తున్న రావలసిన ధనం కొంతవరకు అందుతుంది. మిత్రులు సహకరిస్తారు ధైర్యం పెరుగుతుంది వారం మధ్యలో ధైర్యంగా సంతృప్తికరంగా వృత్తిపరంగా అభివృద్ధి కొరకు వేసుకున్న ప్రణాళికల్లో ఇతర వ్యక్తుల సలహాలు, జోక్యం చికాకు, విసుగు కలిగిస్తుంది. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు గృహ సంబంధిత విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఇష్టమైన వస్తువు కొనుట కొరకు వెనుకాడరు. శుభకార్యాల కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయములు సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మికంగా చేసే ప్రయాణాలు కొంత సంతృప్తిని ఇస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయాలు వారి ఆశీస్సులు తీసుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు. నూతన చర్చలలో ఆసక్తికరంగా పాల్గొంటారు. రామాలయ సందర్శన మేలు
3) మిధున రాశి...(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
ప్రారంభములో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి సమయానికి విశ్రాంతి తగినంత లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. దూర ప్రదేశాల నుంచి అందె కొన్ని విషయాలు మీకు ఆలోచన కలిగిస్తాయి. ప్రయాణాలు సామాన్యముగా ఉంటాయి. భావొద్వేగములు నియంత్రణ అవసరము. స్త్రీలతో అభిప్రాయ బేధాలు రాకుండా వ్యవహరించాలి. మనసు కొంత అలజడి ఉన్న ప్రశాంతంగా ఉంచే ప్రయత్నాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. వారము మధ్యలో చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమావేశంలో మీ గుర్తింపు గౌరవం పెరుగుతుంది. భాగస్వామి సహకారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకి కొంత శ్రద్ధ తీసుకుంటారు. రుణాలు చెల్లిస్తారు. చివరలో స్వగ్రామము సందర్శనపై మక్కువ. వ్యవసాయం గురించి ఆలోచిస్తారు. ఆదాయ పరంగా కొంత వృద్ధికరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థలము, వాహన కొనుగోలు, మరమ్మత్తు అంశాలపై ఆసక్తి. శివాలయ సందర్శన మేలు
4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభము ఆశించిన గౌరవం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. చాలాకాలంగా ప్రణాళిక వేసుకున్నవ్యవసాయము, భూమికి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి తీవ్రముగా ఆలోచిస్తారు. అధిక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్నది సాధించేందుకు ప్రయత్నం చేస్తారు మీ వృత్తిలో కొంత అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు సైంటిఫిక్ గా కొత్త ఆలోచనలు చేస్తారు. స్త్రీ సంతానానికి విద్యా పరంగా అభివృద్ధికరంగా ఉంటుంది వారు ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు. ప్రైవేట్ బిజినెస్ చేసే వారికి, సివిల్ ఇంజనీర్లకి కొంతవరకు అభివృద్ధి. ఆదాయం సామాన్యము కుటుంబ సభ్యులలో ఒకరికి వృత్తిపరంగా నూతన అవకాశములు పెద్దవారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది కళా రంగంలో ఉండే వారికి రాణింపు. శ్రమకి తగినవిలువ వస్తుంది. సంతానం జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి. చిన్న పరిశ్రమ వారికీ కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. మిత్రులు సన్నిహితులు సహకరిస్తారు. కృష్ణ మందిరాలు సందర్శించుట మేలు
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభం విదేశీ వృత్తికి అవకాశాలు. చర్చలు. కుటుంబంలో వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. దూర ప్రదేశాలలో ఉండే తోబుట్టువుల నుంచి సమాచారాలు. ఎదురుచూస్తున్న విషయాలు ఆశించిన ప్రయోజనము సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సామాజిక సేవ చేస్తారు. దూర ప్రదేశాలలో విద్య కొరకు విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ప్రారంభమవుతుంది. మనసులో కోరికలు సాధించేందుకు ప్రయత్నాలు. భూమి నూతన గృహము మొదలైన వాటి గురించి ఎదురుచూస్తున్న విషయాలు సంతృప్తిని ఇస్తాయి. ఆదాయము సంతృప్తినిస్తుంది. రావలసిన ఋణములు అందుకుంటారు ఆధ్యాత్మిక ప్రయత్నాలతో పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కృషితో పెద్దలని కలవడం వారి ఆశీస్సులు తీసుకోవడం గురువుల్ని కలవడం వారి సలహాలు పాటించటం.వ్యక్తులు తమ రంగలలో పోటీలలో నెగ్గేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. దుర్గాదేవి ఆలయ సందర్శనమేలు
6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4 పాదాలు, హస్త 4వ పాదం, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)
వారం ప్రారంభంలో ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన మానసిక తృప్తి, ఆనందాన్నిస్తుంది. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి రావలసిన బకాయిలు అందుకుంటారు. సామాజిక సేవతో గుర్తింపు గౌరవాన్నిపొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు, సంతానానికి విద్యాపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి పరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనానికి కొంత అవకాశాలు. ముఖ్యమైన ఆత్మీయులకు సహకరించడానికి సమయానికి కొంత ధనాన్ని వెచ్చిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన చిన్నపాటి ప్రయాణాలు కూడా అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుట కొరకై ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవముగా ఇంత కాలము చేసిన సేవలకు గుర్తింపు లభ్యము. పరాక్రమం పెరుగుతుంది వారంతములోఒక చక్కని నిర్ణయం తీసుకుంటారు. వృత్తి పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సందర్శనమేలు
7) తులారాశి...(చిత్త 3 4 పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ప్రారంభంలో క్రొత్త వ్యక్తులతో అపార్ధాలకు అవకాశాలు లేకుండా ఆత్మీయులను సంప్రదించి మాట్లాడటం మేలు. ఆర్థికంగా సామాన్యమైన అనుకూలం ఉన్నప్పటికీ ప్రణాళిక బద్ధంగా లేని ఆకస్మిక ఖర్చులు చికాకులు, ఆందోళనని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో, ముఖ్య ప్రయాణాలు, నిర్ణయాలు కొంత వాయిదా మంచిది. ఇతరులతో కలహం రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో జరగవలసిన ముఖ్యమైన పనుల కోసం తండ్రితో, ముఖ్యమైన పెద్దలతో దీర్ఘ చర్చలు నిర్వర్తిస్తారు. ముఖ్య విషయంలో జాగ్రత్త అవసరం. తండ్రికి సాంఘికంగా గుర్తింపు పలుకుబడి పెరుగుతుంది. మీ సలహాలు కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వృత్తిపరంగా భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. చివరిలో వృత్తిలో అధికారులతో సంప్రదింపులు చర్చ సమయములో జాగ్రత్తగా వ్యవహారించాలి. ముఖ్యంగా చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది స్త్రీలతో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా నూతన అవకాశాలకు ప్రయత్నిస్తారు . వెంకటేశ్వర దేవాలయం సందర్శించటమేలు
8) వృశ్చిక రాశి...(విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
వారం ప్రారంభంలో సంఘంలో గుర్తింపు పెరుగుతుంది మీ శ్రమకు తగిన రివార్డులు. కృషి శీలత పెంచుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య అనుకూలత వాతావరణం బాగుంటుంది. భాగస్వామికి వృత్తిపరంగా గౌరవము గుర్తింపు. దూర ప్రదేశాల నుండీ ఆహ్వానాన్నిఅందుకుంటారు. ముఖ్యపనుల్లో కొంత ఆటంకాలు విసుగునిస్తాయి. ముఖ్యంగా డ్రైవింగ్ విషయాల్లోనూ, ఆహార, ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధతీసుకోవాలి. సంతాన అభివృద్ధి సంబంధించిన ప్రణాళికలు. ఆలోచనలు బాగుంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దలు సహకరిస్తారు. భూమికి సంబంధించిన అంశాలలో కొన్ని చికాకులు, ముఖ్య పనులలో ఆలస్యంఅయినా ఓర్పుగా ఎదుర్కొని ముందుకు వెడతారు. శ్రమతో పనులు సాధిస్తారు ఎక్కువ ఖర్చు చేసి గృహాన్నిఅందంగా అలంకరణ వస్తువులతో అలంకరించు కుంటారు. వారము చివరిలో ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉన్నచిన్ననాటి మిత్రులతో ముఖ్య సంప్రదింపులు. వృత్తిపరంగా నూతన ప్రయత్నాలు చేస్తారు. దత్త మందిరాలు దర్శించుట మేలు
9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో నూతన రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు . ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలు రిసార్ట్స్ వంటివటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి వృత్తి సంబంధ, మరియు మీ వృత్తి అభివృద్ధి అంశాలు, చాలా కాలముగా అనుకున్న వాహన, గృహ సంబంధ పరమైన చర్చలు ముందుకు వెడతాయి. జీర్ణ సంబంధ చికాకులు. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరమైన భాగస్వాములతో అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. పనులు, ప్రయాణాలు కొంత వాయిదా పడతాయి. నూతన వ్యక్తుల కొరకు ఆకస్మిక ఖర్చులు. గృహ అవసరమైన కొనుగోలు మొదలైన వాటి కోసం ఆలోచనలు చేస్తారు. వారాంతం దీర్ఘకాలిక పెట్టుబడులకై కుటుంబములో స్త్రీలతో తో కలిసి ఆలోచిస్తారు. గ్రామములో వ్యవసాయ సంబంధ అంశాలు ఆలోచనకి వస్తాయి. స్వగ్రామాన్ని సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థులు విద్యాపరంగా విదేశాలలో మెడికల్ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విశాల గృహ నిర్మాణం కొరకు ఆత్మీయులతో సంప్రదిస్తారు. సంతానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుకి లోను కాకుండా ఉండడం, ఆత్మీయులని సంప్రదించటం అవసరం.దూర ప్రదేశాలలో ఉండే ఆత్మీయుల ద్వారా వార్తలు అందుకుంటారు. హనుమాన్ దేవాలయాలు సందర్శించటమేలు
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)
వారము ప్రారంభము సంతానార్ధులకు అనుకూలమైన సమయం. ఇష్టమైన ఆత్మీయుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు వృత్తిలో కొత్త అవకాశాలు. వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళతారు. భాగస్వామికి వృత్తిపరంగా అభివృద్ధి కరంగా ఉంటుంది. విద్యా పరమైన పోటీలలో నెగ్గడానికి తీవ్రంగా కృషి చేస్తారు. రహస్య శత్రువులపై విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు పొందటానికి ఎక్కువ శ్రమ,వత్తిడి. ఆరోగ్యముపై శ్రద్ధ. వృత్తిపరంగా అభివృద్ధి కరంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా, ధైర్యముగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ కార్యాలలో పాల్గొంటారు. అధికారము ఉండే ముఖ్య స్త్రీలు సహకరిస్తారు. దూరప్రదేశాల్లో నూతన ఉపాధి అవకాశము. ఆత్మీయులు సహకరిస్తారు. విదేశీ సంబంధ అవకాశాలు వచ్చినప్పటికీ పూర్తిగా నిర్ణయం తీసుకోరు. బంధువర్గాన్నికలుస్తారు. సమీపములోని ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శన. వారాంతములో ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు , వాయిదాలు ఉన్నప్పటికీ గట్టిగా కృషి చేసి ముందుకువెళతారు. క్రీమ్ అచ్యుతానంద గోవిందా శ్లోకము చదవడం మేలు
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో నూతన అంశాలు తెలుసుకుంటారు. సంతానముతో వారి విద్యా అంశములలో అభిప్రాయ బేధములు రాకుండా వారితో కలిసి నిదానముగా ఆలోచనలు చేయాలి. వృత్తిపరంగా శ్రమ అధిక బాధ్యతలు. ఉపాసన బలము, ఆధ్యాత్మిక దిశగా ఆలోచిస్తారు, మిత్రులతో మంతనాలు సాగిస్తారు. వారం మధ్యలో ముఖ్య లావాదేవీల్ల లో ఆత్మీయులు, సేవకులు సహకరిస్తారు. పలుకుబడిలో ఉన్న వ్యక్తులతో చర్చలు జరిపేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ. బంధు మిత్రులను కలుస్తారు. సమావేశాల్లో పాల్గొంటారు.ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఆరోగ్యము అనుకూలముగా ఉంటుంది. సంతానానికి విదేశీ అవకాశాలు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులనమ్మి మోసపోవద్దు సమయస్ఫూర్తిగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్లే ప్రయత్నాలు ప్రయాణాలలో పరిచయము లేని వ్యక్తులతో ఇబ్బంది కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో వాతావరణం కొంత చికాకు ఉంటుంది. అయినప్పటికీ మీరు అందరిని కలుపుకుంటూ ముందుకు వెడతారు ఇంతకు ముందు తీసుకున్న రుణములు చెల్లించడానికి ప్రయత్నాలు. అమ్మవారిదేవాలయాసందర్శించటమేలు
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో తోబుట్టువులతో సమావేశాలు చర్చలు. చిన్న ప్రయాణాలు చేస్తారు. మీలోని సృజనాత్మకతతో కొత్త రచనలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. నూతన అంశాలపై శ్రద్ధ. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. భూమికి సంబంధించి, తల్లి వైపు బంధువులకు సంబంధించి కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగర్త. సమయానికి ఆహార స్వీకరణ అవసరము. విద్యార్ధులకి విద్య పై ఆసక్తి పెంచుకోవాలి అనుకూలంగా ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు లేదా వృత్తిలో విదేశీ ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంది. ఆరోగ్య విషయంలో యోగా ప్రాణాయామ మొదలైనవి మంచి ఫలితాలు ఇస్తాయి. శ్వాససంబంధ అనారోగ్యాలు చికాకును కలిగిస్తాయి శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని వృత్తి పరంగా పొందుతారు. మీపై మీకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా అదనపు బాధ్యతలు. ఆలోచనలు బాగుంటాయి. సంతానముతో మంతనాలు జరుపుతారు. విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన మేలు
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)