అనేక పోషకాలకు పెరుగు పెట్టింది పేరు. ఇందులోని ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగును సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు తీసుకున్నా ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదట. అయితే జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.