దేశంలో చాలామంది ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి UPIలతో నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో UPI యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ఆదేశాలు జారీచేసింది.
డిసెంబర్ 31 నాటికి ఏడాదికిపైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది. ఫోన్ నెంబర్ మారినప్పుడు సమస్యలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.