భక్తులు గుడికి వెళ్లినప్పుడు ఆయా దేవుడికి సంబంధించిన పువ్వులను తీసుకెళ్లి పూజిస్తారు. అయితే ఏ దేవుడికి ఎలాంటి పూలు సమర్పించాలి. దాని వల్ల కలిగే లాభమేంటనే విషయం ఎవరికీ తెలియదు.
పున్నాగ పుష్పంతో శ్రీ లక్ష్మీనారాయణుడు, శ్రీ గోపాల కృష్ణ దేవుడికి పూజిస్తే మగ సంతానం కలుగుతుంది. జీవితంలో కష్టాలు పడేవారు విష్ణు సహస్రనామం జపించి ఉత్పల పుష్పం సమర్పించాలి. గణేషుడు, శివుడు, సూర్యుడికి తెల్ల జిల్లెడు పుష్పంతో పూజించాలి.