దేశీయంగా ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరాయి. 2023 మొత్తం మీద ఇవి 41.08 లక్షల మేర అమ్ముడయ్యాయి.
2022లో విక్రయించిన 37.92 లక్షల ప్రయాణికుల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 8.3 శాతం ఎక్కువ. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్లు గతంలో ఎన్నడూ నమోదు చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి.