నల్ల ద్రాక్షాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్షలో విటమిన్ ఏ, విటమిన్ బి 6, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. సాదారణంగా హైబీపీ తో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని నల్ల ద్రాక్ష పండ్లు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీకి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుండి కాపాడతాయి.