ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2023 నవంబర్ నెలలో 71.96 లక్షల మంది భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్టు పేర్కొంది.
అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటివాటిపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. యూజర్ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థ ఆయా ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది.