పచ్చి బఠానీలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బఠానీలు తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. పచ్చి బఠానీలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పచ్చి బఠానీలను కూరగా చేసుకొని కూడా తినొచ్చు.