పచ్చి బఠానీలలో పోషకాలతో పాటు మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారిస్తుందని సూచిస్తున్నారు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయన్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటంతో ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు.