అంతర్జాతీయం డాలర్ విలువ పెరిగిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెడుతోన్న వారి సంఖ్య తగ్గిన క్రమంలో బంగారం ధరలు క్షీణిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం బంగారం ధరలో తగ్గుదల కనిపించగా, ఆదివారం గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58, 000గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63, 270 వద్ద కొనసాగుతోంది.