దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 72,116 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకొని 21,724 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.10 వద్ద ప్రారంభమైంది.