ఎండిన కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాటిలో పొటాషియం ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండిన కివీ పండులో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.