భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 759.49 పాయింట్లు లాభపడి 73,327.94 వద్ద, నిఫ్టీ 215.90 పాయింట్లు పెరిగి 22,110.45 వద్ద ఉన్నాయి.
నిఫ్టీ ప్యాక్ నుంచి విప్రో, ONGC, HCL టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ఉండగా, HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి.