దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 73,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 22,068 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.93 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.