అంతర్జాతీయ క్రికెట్కు సచిన్ టెండూల్కర్ గుడ్ బై చెప్పి 10 ఏళ్లయింది. అయితే మరోసారి క్రికెట్ గాడ్ మరోసారి మైదానంలో అడుగు పెట్టనున్నారు. 18న బెంగుళూరులోని సాయికృష్ణ క్రికెట్ స్టేడియంలో జరిగే వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బులను విద్య, ఆరోగ్య రంగాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సచిన్ 2013లో చివరి టెస్టు మ్యాచ్ ఆడారు.